TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 17. మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పోలీస్ సేవలపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.

ఖమ్మం రూరల్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ కార్యాలయం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్
ఫీల్డ్ విజిట్ చేయాలని, నేరాల నియంత్రణలో
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు.

విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంపొందించాలన్నారు. నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాలను అడ్డుకునేందుకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారని, ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా వ్యవసాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, జిల్లా సరిహద్దుల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేయాలని అన్నారు
చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను, హాట్ స్పాట్లుగా, బ్లైండ్ స్పాట్ ఎక్కడ రా గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ తిరుపతి రెడ్డి, సిఐ లు, ఎస్సై లు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *