TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో జేవీఆర్ (JVR), కిష్టారం సింగరేణి ఓపెన్కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో సుమారు 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
అలాగే గనుల్లో చేపడుతున్న ఓవర్బర్డెన్ (మట్టి) తొలగింపు పనులు కూడా వర్షం కారణంగా పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 95 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు ప్రభావితమైనట్లు సమాచారం. వర్షపు నీటిని బయటకు పంపించిన అనంతరం పరిస్థితిని సమీక్షించి, వాతావరణం అనుకూలిస్తే ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులను తిరిగి ప్రారంభించనున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.