TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జులై 17. మండలం పరిధిలోని ఉప్పలచలక (గౌరారం) గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితవాడ కాలనీలో సర్వే నిర్వహించడం జరిగింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 25 లక్షల డిఎంఎఫ్టి నిధులతో 2023లో నిర్మాణం చేపట్టి ఇప్పటివరకు పూర్తి చేయలేదు. సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆపినట్టు సదరు కాంట్రాక్టర్ వివరించారు. మూడు సంవత్సరాలుగా ఎండకు ఎండి వానకు తడిసి శిథిలావస్థగా మారిందని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని ఈ భవనం పూర్తి అయితే పేదల శుభకార్యాలకు విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు పేర్కొన్నారు.

గౌరారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆగిపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని గ్రామానికి రావలసిన కేంద్ర నిధులు నిలిపివేయడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళు దాటినా ప్రజా పాలన దరఖాస్తు దారులకు పెన్షన్ మంజూరు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో డ్రైనేజీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, నిరుపేద కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని ప్రతి పేదవానికి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని, భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12వేల ఆర్థిక సహాయం అంద జేయాలని ఏజెన్సీ ప్రాంతం కావడం వలన పట్టాలు లేక, యూరియా రాక చిన్న సన్నకారు రైతలు అవస్థలు పడుతున్నారని, వారికి వెంటనే ఆధార్ కార్డు సహాయంతో యూరియా ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చెమట విశ్వనాథం జొన్నలగడ్డ రమణయ్య సిలిమంత సీతారాములు జోన్నలగడ్డ వెంకటేశ్వరరావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *