పాఠశాల విద్య మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో బుధవారం పెనుబల్లి తహశీల్దార్ వీరభద్ర నాయక్ కి వినతిపత్రం (మెమోరాండం) సమర్పించారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ… పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు.

వినతిపత్రంలో ఉన్న ప్రధాన డిమాండ్లు.

  1. PRC నివేదికను వెంటనే తెప్పించుకుని, 01.07.2023 నుండి అమలు చేయాలి.
  2. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 6 విడతల డిఎ (DA)లను వెంటనే విడుదల చేయాలి.
  3. CPS రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
  4. పాఠశాలల మూసివేత ఆలోచనను విరమించుకోవాలి.
  5. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలి.
  6. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి.

ఈ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 29న రాష్ట్ర రాజధానిలో వేలాది మంది ఉపాధ్యాయులతో భారీ నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.
పాల్గొన్నవారు:

ఈ కార్యక్రమంలో TSUTF బాధ్యులు జి వీరస్వామి, K శ్రీనివాస రావు, TPTF బాధ్యులు Y శ్రీనివాస్, డి శ్రీనివాస్ TAPRA బాధ్యులు వి వి రామారావు, ఎం నరసింహరావు, మమండల ఉపాధ్యాయులు కె చిన్న రాము, కె నాగేశ్వరరావు, టి మురళీకృష్ణ, జీ రవికుమార్, ఎస్ పుల్లారావు, జి హనుమంతు, పి ముత్తయ్య ఆర్ వీరభద్రరావు ఎస్ వెంకటేశ్వర్ రావు, SSA బాధ్యులు ప్రకాష్, రమేష్ గోపాలకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *