TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, కల్లూరు మండలం, ఆగస్ట్ 14. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కల్లూరు మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కట్టా అజయ్ బాబు మాట్లాడుతూ సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. సండ్రను, బీఆర్ఎస్ పార్టీని ఓడించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
సండ్ర వెంకట వీరయ్య భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరల గెలిచి ఉన్నత పదవులు అధిరోహించాలని అజయ్ బాబు ఆకాంక్షిస్తూ సండ్రా వెంకట వీరయ్యకు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.