TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, ఆగస్ట్ 15. ఖమ్మం స్పీడ్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కేటింగ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అకాడమీ కోచ్ నాగిశెట్టి శివ సాయి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో చిన్నారుల నుంచి యువ స్కేటర్ల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తి నినాదాలతో స్కేటర్లు ర్యాలీలో పాల్గొన్నారు. కేవలం నాలుగేళ్ల వయసున్న చిన్నారి స్కేటర్లు కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిన్నారుల్లో దేశభక్తితో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశ్యమని కోచ్ నాగిశెట్టి శివ సాయి కృష్ణ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *