పెనుబల్లి మండలం, జూన్ (TV6 24/7 NEWS):ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పిఎంసి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురుగా శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు ఇద్దరు మైనర్ బాలికలను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్కూల్ వద్దకు వచ్చి, అక్కడనుండి విఎం బంజర్ వైపు వెళుతున్న క్రమంలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధుడిని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లకు చిన్నచిన్న గాయాలు కాగా వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను చూసిన స్థానికులు 108 సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది పైలెట్ సైదా, టెక్నీషియన్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్ సిబ్బంది గాయపడిన నలుగురికి ప్రధమ చికిత్స అందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *