కన్న కొడుకును హత్య చేసిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, కల్లూరు టౌన్ మండలం, జులై 07. ఖమ్మం జిల్లా కల్లూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. చెడు వ్యసనాలకు బానిసైన సీతారాములు అలియాస్ జాన్ మార్క్ తన ఇంటిని అమ్మేందుకు కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో సొంత కుమారుడు కిరణ్ కుమార్ను హత్య చేయాలని కుట్ర పన్నాడు.
జూలై 3న కుమారుడిని బెల్ట్ షాప్కు తీసుకెళ్లి మద్యం తాగించి ఇంటికి తీసుకొచ్చిన అనంతరం, మత్తులో నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో తలపై బలంగా దాడి చేశాడు. కుమారుడు చనిపోయాడని భావించిన నిందితుడు ఆటోలో పరారయ్యాడు.
కల్లూరు ఎస్సై సరిత ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి సోమవారం ముగ్గు వెంకటాపురం గ్రామం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని, అతని వద్ద నుంచి ఆటో, రోకలిబండ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఏజేఎఫ్సీఎం సత్తుపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తి లింగయ్య తెలియజేశారు.