అంగన్‌వాడీ సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్డర్ కాపీల పంపిణి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 08. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సత్తుపల్లి మండలం, సత్తుపల్లి పట్టణానికి చెందిన బదిలీలు, పదోన్నతులు పొందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఆర్డర్ కాపీలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సీడీపీఓ సత్యవతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బదిలీలు, పదోన్నతులు పొందిన సిబ్బందికి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ సేవల్లో మరింత బాధ్యతాయుతంగా పనిచేసి మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *