24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండల కేంద్రం మండలం, జులై 09. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఈ నెల 10న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మధిర నియోజకవర్గ పరిధిలోని జగన్నాథపురంలో జరిగే ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేందుకు అధికారులు నాయకులు సాయి శక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం నందు ఏపిఎం సంపత్ కుమార్ డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులను సమావేశం ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలందరూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి సభకు తరలిరావాలని కోరారు.