TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 09. జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ అంత్యక్రియలు వరంగల్ జిల్లా హన్మకొండలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరంజన్‌కు తుది వీడ్కోలు పలికారు.

జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఫోన్ ద్వారా నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పార్టీ జిల్లా నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సత్తుపల్లి నుండి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆళ్ళ నరేష్, కార్యవర్గ సభ్యులు సంతాపం తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *