ఉమ్మడి ఖమ్మం జిల్లాలో “రైతు ఆశీర్వాద సభ”లో పాల్గొన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ప్రతి రైతన్న ఖాతాలో జమ చేసి కర్షక లోకం పట్ల మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.

కొందరు దొంగ సర్వేలు చేయించుకుని, అది చూసి సంబరపడుతున్నారు. ఈ రోజు నేను చెబుతున్నా… వచ్చే ఎన్నికలు 2029 లో జరుగుతాయి… ఆ ఎన్నికల్లో మేం 117 శాసన సభ స్థానాలు గెలిచి, ప్రజా ప్రభుత్వం. 2.O ను ఏర్పాటు చేస్తాం.

రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే… ఖమ్మం నా గుండెకాయ.

కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. బీజేపీలోకి వెళ్లనని హరీష్ రావు కేసీఆర్ పై ఒట్టేసి చెప్పగలడా బీఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేస్తారని కేటీఆర్ సొంత చెల్లెలే చెబుతోంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ కు రూ. 1400 కోట్లు ఇచ్చారని కేటీఆర్ సొంత చెల్లే చెప్పింది.

ప్రజా ప్రభుత్వం వచ్చాకనే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం . రైతు భరోసా రూ.12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం అని సభాముఖంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *