TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 12. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పాయింట్ వద్ద ఈగల్ టీం, వీఎం బంజర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు.
గంజాయిని తరలిస్తున్న టాటా ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, గంజాయి రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం TV6 24/7 NEWS ను ఇప్పుడే Subscribe చేయండి.
—————————
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…