TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, భద్రాద్రి కొత్తగూడెం, జులై 12: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సారథ్యంలో చేపట్టనున్న “సింగరేణి భరోసా యాత్ర” సోమవారం భద్రాద్రి కొత్తగూడెం నుంచి ప్రారంభం కానుంది. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల ఉపాధి భద్రత, సంస్థ భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సింగరేణికి తాడిచర్ల బ్లాక్‌ను కేటాయించడం ద్వారా భవిష్యత్ బొగ్గు నిల్వలను పరిరక్షించే చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు పర్యవేక్షిస్తుండగా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కృష్ణ, వెంకన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *