TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జులై 14. రోడ్లపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం కేజ్ వీల్స్‌ను ఉపయోగించినప్పటికీ, పొలాల్లో పని పూర్తయిన వెంటనే వాటిని తొలగించి సాధారణ టైర్లతోనే రహదారులపై ప్రయాణించాలని సూచించారు. కేజ్ వీల్స్‌తో రోడ్లపై ప్రయాణించడం వల్ల ప్రభుత్వ రహదారులు తీవ్రంగా దెబ్బతింటాయని, ప్రజల ధనంతో నిర్మించిన రహదారులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కమిషనర్, రైతులు, ట్రాక్టర్ యజమానులు తప్పనిసరిగా ట్రాఫిక్, రవాణా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఎవరైనా కేజ్ వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లు నడుపుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో చూద్దాం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *