TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, దమ్మపేట మండలం, ఆగస్ట్ 11. గండుగులపల్లిలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (EMRS)ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ‘నేను సైతం చేయూత విద్యా అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా ‘MLA విద్యాయాత్ర – మన MLA మన బడి’ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే… డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం తరగతి గదులు, హాస్టల్, తాగునీరు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి సమస్యలు, చదువు విషయాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇదప్ప, దమ్మపేట మండలం ట్రైనింగ్ కలెక్టరు ఎం మురళి, ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, ఎంఇఓ జగపతిరావు, సిఐ నాగరాజు, ఎస్ఐ రాజేష్, మాజీ సర్పంచ్ మడకం రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాక రమేష్, స్థానిక PHC డాక్టర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…