TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, మండలం, ఆగస్ట్ 13. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రాతోని చెరువులోని గ్రామానికి తాగునీరు అందించే సబ్మెర్సిబుల్ మోటార్కు విద్యుత్ సరఫరా చేసే వైర్లను దుండగులు అపహరించినట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు.
గత 50 రోజులలో ఇది రెండవసారి అని పంచాయతీ సిబ్బంది తెలియజేశారు. దీంతో గ్రామంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేయాలని ఉద్దేశంతో కరెంటు వైర్లు ఎత్తుకెళ్తున్నారా ? లేక దొంగలు ఎత్తుకెళ్తున్నారా ? అనేది తెలియాల్సి ఉంది. తక్షణమే స్పందించిన గ్రామ సర్పంచ్ బానోతు పాపా సీతారాం కొత్త వైర్లను తెప్పించి వెంటనే మోటార్లను వినియోగంలోకి తీసుకొని వచ్చారు.