TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 8: పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నానని కాంగ్రెస్ నాయకుడు అన్నపరెడ్డి శ్రీనివాస్ (ఎఎస్ఆర్) అన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతుల ఆశీర్వాదం, సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు.

గత మూడు రోజులుగా పెనుబల్లి మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, గత కొన్నేళ్లుగా పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను గుర్తించినట్లు ఎఎస్ఆర్ తెలిపారు. ఆయా సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సంప్రదించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం సంతృప్తినిస్తోందన్నారు.

ప్రజల వద్దకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనుబల్లి మండల కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు ఏ మేరకు చేరాయో ప్రతి ఒక్కరికీ వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని ఎఎస్ఆర్ అన్నారు.

పెనుబల్లి ప్రజలకు జరిగిన అభివృద్ధిని, అందిన సంక్షేమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గ్రామంలోని ప్రతి ఓటరును కలుసుకుని వాస్తవ పరిస్థితులను వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

15 ఏళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ

పెనుబల్లి మండల కేంద్రంలో గత 15 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు ప్రజల ముందు ఉంచాల్సిన తరుణం వచ్చిందని ఎఎస్ఆర్ పేర్కొన్నారు.

ఇది ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలుసుకుని సమస్యలు తెలుసుకునే రాజకీయ విధానం కాదని, ప్రజా సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాల్సిన సమయం ఇదేనని అన్నారు.

ఇప్పుడు కష్టపడితే.. భవిష్యత్తులో కాంగ్రెస్‌కే విజయం

ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడిగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పడం కంటే.. ఇప్పటి నుంచే ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎఎస్ఆర్ అన్నారు.

ప్రజలతో నిరంతరం మమేకమై, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసి, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను ప్రజలకు వివరించగలిగితే భవిష్యత్తులో ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ విజయానికి బలమైన పునాది ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?”

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటి నుంచే ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ఎఎస్ఆర్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ భాగస్వాములై, సమష్టిగా ముందుకు సాగితే పెనుబల్లి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

రైతుల సమస్యలపై నిలబడిన ఏఎస్ఆర్… రైతుల ప్రశంసలు

లిఫ్ట్ ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యపై లిఫ్ట్ ఆయకట్టు రైతుల పక్షాన నిలబడి ఏఎస్ఆర్ చేసిన కృషి రైతుల మన్ననలు పొందుతోంది. రైతులతో కలిసి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రాలు అందించడంతో పాటు, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.

ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు విషయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కనగాల సాంబశివరావుతో కలిసి పనిచేస్తూ, అద్దె ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు కూడా చొరవ చూపారు. రైతుల సమస్యను తన సమస్యగా భావించి, రైతుల కష్టాల్లో తోడుగా నిలిచి.. సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గకుండా కృషి చేసిన ఏఎస్ఆర్‌ కు రైతుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏఎస్ఆర్‌కు ఇదే ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు.”

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *