TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 8: సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ హామీ ఇచ్చారు.

సత్తుపల్లి పట్టణంలోని ఖాబ్రస్తాన్ స్థలానికి సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ దివాకర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్‌తో కలిసి వేంసూరు రోడ్డులోని నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఖాబ్రస్తాన్ స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి అజయ్ యాదవ్, తహసీల్దార్ (ఎంఆర్‌ఓ), ఎంపీడీఓ, అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *