హైదరాబాద్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ , ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారనిపువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అన్నారు.
అదేవిధంగా అటవీ, దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించామని దుర్గ ప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కొప్పురావూరి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.