TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన సైబర్ నేరములో మరో నిందితుడు నల్ల నాగుల శ్వేతన్ R/o ఖమ్మం అను వ్యక్తిని గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శ్రీహరి అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం తరలించారు. ఇతను 2023 లో కేథలిక్ సిరియన్ బ్యాంక్(CSB) చంద్రుగొండ లో శ్వేతన్ ఎంటర్ ప్రైజెస్ అనే కరెంట్ ఎకౌంట్ ఓపెన్ చేసినాడు.
ఇట్టి కేసులో తేదీ: 23.02.2026 నాడు అరెస్ట్ కాబడిన అడపా రామవెంకట చరణ్ R/o ముష్టిబండ ప్రస్తుతం హైదరాబాదు, అనునతను ఒప్పుకున్న ప్రకారం, అతని స్నేహితులు ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ అనువారు హైదరాబాదు లో ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా విదేశాలలోని కొద్ది మంది వ్యక్తులతో సంబంధాల ఏర్పాటు చేసుకొని, కాల్ సెంటర్ లను నడుపుతూ, వాటి ద్వారా మన దేశంలోని పౌరులకు ఫోన్లు చేస్తూ, అధిక లాభాలు ఆశ చూపి స్టాక్ మార్కెట్ల యందు ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్, గేమింగ్, బెట్టింగ్లు, ఓటీపీ ఫ్రాడ్స్, రూపే, ట్రాన్సాక్షన్స్, మ్యాట్రిమోనీ పేర్లతో ఫోన్లు చేసి, అధిక లాభాల ఆశ చూపి ఎవరైనా వారి మాటలకు, ఆకర్షితుడైతే అతనిని వారు నిర్వహించే టెలిగ్రామ్ గ్రూపులకు యాడ్ చేస్తూ అతనికి వివిధ రకాలైన లింకులు మరియు క్యూఆర్ కోడ్ లు పంపి వారి బ్యాంక్ అకౌంట్ లో నుండి మోసపూరిత మార్గాల ద్వారా వారి డబ్బులను మొత్తం కాజేసేవారు.
అందుకుగాను వారికి పలు బ్యాంక్ కరెంట్ అకౌంట్ లు అవసరం వుండి చాలా మందితో మూల్ ఎకౌంట్స్ తీసుకొని వారి ద్వారా లావా దేవీలు నడిపేవారు. ఇట్టి సైబర్ కేసులో మొత్తం (28) మంది ముద్దాయి లలో ఇప్పటి వరకు (27) మందిని అరెస్ట్ చేసి రిమాండు కు పంపటం జరిగినది. ప్రస్తుతం కేసు పరిశోధనలో వున్నది.
