మధిర నియోజకవర్గం, జూన్ 08 (TV6 24/7 NEWS): మధిర నియోజకవర్గం పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
ఈ సందర్భంగా జూనియర్, సీనియర్ హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ల్యాబ్ భవనాల పురోగతిని సమీక్షించిన మంత్రి బట్టి అధికారులకు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం భవనాలు కావు, రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలు. విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. విద్య కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి వ్యయం కాదు, భవిష్యత్ తరాల అభివృద్ధికి పెట్టే పెట్టుబడి. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.