ఖమ్మం టౌన్, జూన్ 12 (TV6 24/7 NEWS): ఖమ్మం పట్టణంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ విక్రయ కేంద్రమైన ‘సోని విజన్’ షోరూమ్‌లో 11వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గుర్తుతెలియని దుండగులు షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి, స్టాక్ రూమ్‌లో భద్రపరిచిన విలువైన, అధునాతన మొబైల్ ఫోన్లు చోరీ జరిగినట్లు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. షాపు పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
