ఖమ్మం టౌన్, జూన్ 12 (TV6 24/7 NEWS):
ఖమ్మం పట్టణంలోని బాధిత చిన్నారిని గురువారం నిమ్స్ హాస్పటల్లో ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు రాష్ట్ర అధికార ప్రతినిధి వాకధాని పుల్లారావు యాదవ్ లతో కలిసి చిన్నారిని, చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కోటేశ్వరావు మాట్లాడిన ప్రధానాంశాలు.
👉 ఇది చాలా హేయమైన చర్య.
👉 ఖమ్మంలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణం,
👉చిన్నారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి.
👉 జీవితంలో ఆ చిన్నారి నడుస్తుందో నడవలేదొ వైద్యులు చెప్పలేకపోతున్నారు.
👉 వాచ్మెన్ డ్యూటీ చేసుకునే ఆ చిన్నారి తండ్రికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగం కల్పించాలి.
👉 ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.
👉 ఆచిన్నారి పేరా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆచిన్నారిని ఆదుకోవాలి.
👉 జిల్లా ముగ్గురు మంత్రులు ఈ చర్య పై వెంటనే స్పందించాలి,
# ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆమానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి.