ఖమ్మం టౌన్, జూన్ 13 (TV6 24/7 NEWS):ఖమ్మంలో 12 ఏళ్ల బాలిక పై 50 సంవత్సరాల మహ్మద్ గౌస్ పాషా లైంగికంగా దాడి చేసి మేడ పై నుంచి కిందకు తోసేయడం అత్యంత దారుణమని విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర నాయకులు రామరాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్టలో ని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలికను వీ విహెచ్ పి నాయకులు రామరాజు, సుభాష్ చందర్, రాజేందర్ రెడ్డిలు పరామర్శించారు.
అనంతరం వారు మాట్లాడుతూ… 12 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి మేడ పై నుంచి తోసేయడం మానవ జాతికే అవమనమన్నారు. ఆ కామందుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 10 లక్షలు వెంటనే అందజేసి.. బాలిక పేరు పై కోటి రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్ నింధితులను కాపాడుతుందని ఆరోపించారు. హిందు బాలిక పై ఇంత అఘాత్యం జరిగిన ఏఒక్క నాయకుడు మాట్లాడలేక పోతున్నారని వాపోయారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.