TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి మండలం, జూన్ 14. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రెండవసారి పంది వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో జరిగిన బూత్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, చేతుల మీదుగా పంది వెంకటేశ్వర ఆకు పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు అధికారికంగా నియామక పత్రం అందించారు.
ఈ సందర్భంగా పంది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు పైగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడి పని చేశానని, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గైడ్లైన్స్ ప్రకారం పని చేస్తానని, మండలంలోని అందరి నాయకులను సమన్వయతో కలుపుకొని పనిచేస్తానని అన్నారు. అలాగే పెనుబల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కూడా వారి సహాయ సహకారాలు తనకు అందించాలని పంది వెంకటేశ్వరరావు కోరారు.