TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు టౌన్, జూన్ 20. కల్లూరు పట్టణంలోని పాఠశాలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, తరగతి గదుల పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన సదుపాయాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే రాకమయి దయానంద్ కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *