TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 23. మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ హైస్కూల్‌లో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఖమ్మం టౌన్ ఏసీపీ బహుమతులు అందజేశారు.

ఈ సందర్బంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ… డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని, యువత మాదక దవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడినవారు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *