TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మండలం, జులై 02. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటి చైర్మన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల విలువైన 950 కిలోల గంజాయిని అధికారులు బుధవారం ప్రత్యేక ఇన్సినిరేటర్‌లో పూర్తిగా నిర్వీర్యం చేశారు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని, మాదకద్రవ్యాల వినియోగించిన, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరికలు జారీ చేశారు.

గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని కోర్టు అనుమతులతో శాస్త్రీయ విధానంలో దహనం చేశామని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, దొరికిన వారిపై కఠిన చర్యలు తప్పవని, డ్రగ్స్ వ్యాపారులపై మరింత ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు.

ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం TV6 24/7 NEWS ను ఇప్పుడే Subscribe చేయండి.

https://youtube.com/@tv6247news?si=hXBJ8fxIBGIjHVF5

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *