TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెనుబల్లి మండల భగవద్గీత పరివార్ ఆధ్వర్యంలో భక్తులు కోదండ రామాలయంలో భగవద్గీతలోని 18 అధ్యాయాలకు చెందిన 700 శ్లోకాలను ఏకస్వరంతో, ఏక పట్టణ పారాయణం చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గీతా పారాయణంలో భక్తి భావంతో పాల్గొన్నారు. గీతా సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలనే లక్ష్యంతో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం వేదమంత్రాలు, గీతా శ్లోకాల నినాదాలతో మార్మోగిపోగా, పాల్గొన్న భక్తులు తొలి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *