TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్ భద్రాద్రి కొత్తగూడెం. జులై 26. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గ కమిటీల పదవీ స్వీకార మహోత్సవం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను క్షేత్రస్థాయికి చేర్చడమే ప్రతి కార్యకర్త ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ సెల్ నాయకులు ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యానికి రూ.500 బోనస్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *