👉 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం.. దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం.
👉 మధిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. మధిర, జూలై 27: ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ…. తినే పదార్థానికి రుచి ఉండొచ్చు… కానీ ఆత్మ ఉండదు. వండేది మంచి మనసైతే ఆ పదార్థానికి జీవం వస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తమ సొంత బిడ్డల్లా భావించే నాయకత్వం ఉంటే ఆ ఆత్మీయత ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కనిపిస్తుందని అన్నారు.
విద్యార్థులతో కలిసి ఈ కిచెన్ లో స్వయంగా అల్పాహారం చేశారు. ఈ కిచెన్ ద్వారా మధిర పరిసర ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందుతుందని అన్నారు. సంబంధిత అధికారులతో సమావేశమైన భట్టి విక్రమార్క, కిచెన్ నిర్వహణ, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, సరఫరా వ్యవస్థపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.