TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం: ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 17 మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు వన్ టౌన్ పోలీసులు అప్పగించారు.

CEIR పోర్టల్, IMEI ట్రాకింగ్ ద్వారా వన్‌టౌన్ సిబ్బంది, ఐటీ కోర్ టీం సమన్వయంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు స్వయంగా అందజేశామని, ఇప్పటివరకు మొత్తం 613 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ… ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు కీలకమైన వనరుగా మారిందని అన్నారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సంబంధిత వివరాలతో పోలీసులను సంప్రదించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *