TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, , హైదరాబాద్ ఆగస్ట్ 11. తెలంగాణ పోలీసు శాఖలో నలుగురు అధికారుల పనితీరుపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా కొందరు అధికారుల పనితీరులో మార్పు రావడం లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఇకపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు.

పోలీసు వ్యవస్థలో పనితీరు మెరుగుపడేలా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, అధికారుల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలీసింగ్‌లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ, దర్యాప్తు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీజీపీ ఇప్పటికే స్పష్టం చేశారు.

కాగా,అ నలుగురు అధికారుల పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. అధికారులకు పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ పనితీరు మెరుగుపడకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, పనితీరులో లోపాలు కొనసాగితే శాఖాపరంగా చర్యలు తప్పవనే సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పనితీరును నిరంతరం సమీక్షిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *