సత్తుపల్లి: సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ జన్మదినం సందర్భంగా పాత కరిగూడెం గ్రామంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ నరుకుల్లో అనురాధ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు దూదిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పలకలు, పెన్నులు, పుస్తకాలు, నోట్బుక్స్, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తి పెరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.