TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్ ఆగస్టు 11. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి పుట్టినరోజు సందర్బంగా సత్తుపల్లి మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్,
మున్సిపల్ చైర్మన్ రెహనా కమల్ పాషా చేతుల మీదుగా అందించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్మన్ రెహనా కమల్ భాష మున్సిపల్ కార్మికులు తో కలిసి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సత్తుపల్లి మున్సిపల్ కార్మికులకు స్వయంగా భోజనం వడ్డీంచి, వారితో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ నరసింహ, మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ఎస్యుఐ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *