TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, ఆగస్ట్ 13. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి రేణుకా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు మలిరెడ్డి మురళి రెడ్డి, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *