TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 19. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను ఈ సందర్భంగా గౌడ సోదరులు బహుజన సోదరులు స్మరించుకున్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోనూ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గంగాదేవిపాడు, విఎం బంజర్, పెనుబల్లి, తాళ్లపెంట, గణేశునిపాడు గ్రామాల్లో పాపన్న గౌడ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌడ, బహుజన సోదరులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పెనుబల్లి మండల గౌడ సంఘం అధ్యక్షులు ఏడా కమలాకర్ మాట్లాడుతూ…. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కమలాకర్ యువతకు పిలుపునిచ్చారు.