TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, మండలం, ఆగస్ట్ 21. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు మరియు ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని వైరా ఏసీపీ సారంగపాణి సూచించారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు, వైరా ఏసీపీ మధిర రూరల్ సీఐ, మధిర టౌన్ సీఐ, వైరా సీఐ, సబ్ డివిజనల్ ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది ఎర్రుపాలెం రింగ్ సెంటర్లోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద వాహన తనిఖీలు నిర్వహించి, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.