TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అశ్వారావుపేట ఆగస్ట్ 25 : అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానికుల భాగస్వామ్యంతో కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, మొక్కల పెంపకం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మొక్కలు నాటి వన మహోత్సవానికి ప్రోత్సాహం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించే జీవనదాతగా భావించి, వాటిని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎస్. లక్ష్మీకుమారి రామకృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీవో రామ్‌రెడ్డి, జూపల్లి ప్రమోద్, కౌన్సెలర్ హరిబాబు, దివాకర్, కోలా లక్ష్మీనారాయణ, కాసాని పద్మశేఖర్, అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *