TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 04. తెలంగాణ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని సిద్దారం రోడ్ ఎంఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

మంత్రి సీతక్క, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళా లబ్ధిదారులకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు, రైతులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సహకారంతో 100 మంది మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లను మంత్రి సీతక్క, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ అందజేశారు.

మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని నాయకులు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ఎమ్మెల్యే దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *