TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి మండలం, సెప్టెంబర్ 05. సత్తుపల్లి నియోజకవర్గంలో దాసరి కుటుంబం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, ప్రభుత్వ పాఠశాలలకు డెస్క్ బెంచ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గంగారం శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు బ్యాగులను, పాఠశాలలకు డెస్క్ బెంచ్లను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. రామగోవిందాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యార్థులకు కూడా బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యా రంగానికి అండగా నిలుస్తున్న దాసరి కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాసరి మధుమోహన్ రెడ్డి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహనా కమల్ పాషా, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.