TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 07. తెలంగాణ శాసనసభ తొలి రోజున సభ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ తీవ్రంగా స్పందించారు.
గౌరవనీయ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో, బాధ్యులపై చట్టపరంగా మరియు సభా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
సభాపతి పదవి ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదని, అది ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ పదవని ఎమ్మెల్యే రాగమయి పేర్కొన్నారు.
అలాగే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని, అవసరమైతే స్వయంగా సభాపతిని కలిసి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.