అంతర్జాతీయ ఫోటో ఎగ్జిబిషన్లో అవార్డును అందజేసిన బీజేపీ ఎమ్మెల్యే జాజిరి శ్రీనివాసరావు
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లెల సతీష్‌కు సేవా పురస్కార్ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డును బీజేపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజిరి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు.
ఫోటోగ్రఫీ రంగంలో సేవలు, కృషిని గుర్తిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్లెల సతీష్‌కు పురస్కారం అందించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫోటో క్యాప్షన్: మల్లెల సతీష్‌కు సేవా పురస్కార్ అవార్డు అందజేస్తున్న జాజిరి శ్రీనివాసరావు.