అన్ని వర్గాల ప్రజలను ఎమ్మెల్యే దంపతులకు చేరువ చేస్తా…ఏఎస్ఆర్.
కాంగ్రెస్ నాయకుడు అన్నపురెడ్డి శ్రీనివాస్ (ఏఎస్ఆర్)
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 10: అక్టోబర్ పెనుబల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని పెనుబల్లి కాంగ్రెస్ నాయకుడు అన్నపురెడ్డి శ్రీనివాస్ (ఏఎస్ఆర్) అన్నారు.
శనివారం రాత్రి ఏఎస్ఆర్, మద్దెల దుర్గారావు, మారిన శ్రీనివాసరావు, మద్దెల వెంకన్నతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఏఎస్ఆర్ మాట్లాడుతూ, పెనుబల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటిని ఎమ్మెల్యే దంపతుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతుల దృష్టికి తీసుకువెళితే, వాటి పరిష్కారానికి వారు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని ఏఎస్ఆర్ తెలిపారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.