ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్.
పెనుబల్లి, అక్టోబర్ 13: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని బీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ కుబేర ఆంజనేయస్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి వివిధ అలంకరణలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొంది పునీతులు అవుతున్నారు.