దమ్మపేట మండలం మల్కారం గ్రామ పంచాయతీ
గుత్తావారిగూడెం లో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం
మల్కారం గ్రామంలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆది నారాయణ. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కామెంట్స్….
👉 పూజ్యులు ఎన్టీఆర్ దీవెనలతో సత్తుపల్లి ప్రజానీకం నాకు రాజకీయ అవకాశం ఇచ్చారు.
👉 రాజకీయం అంటే ప్రజా సేవగా నలబై ఏళ్లుగా సాగుతున్న. నేను ఏ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న.
👉 పామాయిల్ సాగుతో తెలంగాణ పచ్చగా సశ్య శ్యామలంగా మారాలి. పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ టార్గెట్.
👉 ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే మద్దతు ధర సమస్యలు ఉన్నాయి. అకాల వర్షాల వల్ల రైతాంగానికి నష్టాలు.
👉 చీడ పీడలు లేకుండా కోతుల బెడద లేకుండా అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులకు వరంగా మారిన పంట పామాయిల్ సాగు.
👉 పామాయిల్ లో అంతర పంటలుగా కోకో జాజి వక్క సాగుతో అదనపు లాభం. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నిర్మాణం
👉 దమ్మపేట అశ్వరావుపేట పామాయిల్ తోటలు చూస్తే మలేసియా మాదిరి కనువిందు గా ఉంటుంది.
👉 సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని పామాయిల్ హబ్ గా మారుస్తాం.
👉 పామాయిల్ సాగుతో తెలంగాణ రైతులు తలరాత మారుతుంది. పామాయిల్ సాగు వల్ల పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర ఆర్ధిక ప్రగతిలో కీలకంగా మారుతుంది.