TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 20. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని మణికొండ సమీపంలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. జూన్ 19న జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. మణికొండలోని మల్కంచెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ఇకపై తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేయనుందని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.

ఈ నూతన కార్యాలయం ద్వారా తెలంగాణలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, అనుబంధ విభాగాల ఏర్పాటు, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై స్పందించేందుకు ఈ కార్యాలయం కీలక వేదికగా ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *