TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం, జూలై 14: ఖమ్మం జిల్లాను రాష్ట్ర పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో లకారం పార్క్ సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో ఆధునిక ‘హరిత భవన్’ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, నిర్మాణ ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఐదు ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం కేటాయించగా, ప్రతిపాదనలు అందిన వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు.

ప్రాజెక్టుకు తొలుత ‘హరిత హోటల్’గా ప్రతిపాదించిన పేరును, తెలంగాణ సంస్కృతి, ఆతిథ్య సంప్రదాయాలకు అనుగుణంగా ‘హరిత భవన్’గా మార్చాలని మంత్రి సూచించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. హరిత భవన్ నిర్మాణం పూర్తయితే ఖమ్మానికి వచ్చే పర్యాటకులు, భక్తులు, వ్యాపారవేత్తలకు మెరుగైన వసతి సౌకర్యాలు అందడంతో పాటు జిల్లా పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం లభించనుందని అధికారులు, ఖమ్మం జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *