TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి, జూలై 14: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న క్రిస్టియన్ భవనం పనులను సందర్శించి, నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడడంతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వేశ్యకాంతుల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా పనులను వేగవంతం చేయాలని సూచించారు.

తదుపరి సత్తుపల్లి స్మశానవాటికలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన డాక్టర్ మట్టా దయానంద్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి కొనసాగిస్తామని తెలిపారు.